సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో ‘వారణాసి’ తెరకెక్కుతోంది. ఈ మూవీలో మహేష్ 5 పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రుద్ర, రాముడు, శివుడు పాత్రలతో పాటు మరో రెండు పాత్రల్లో లేదా షేడ్స్‌లో కూడా కనిపిస్తాడట. కానీ రుద్ర పాత్ర మాత్రమే ప్రధానంగా ఉంటుందట. 2026 వేసవి వరకు ఈ మూవీ షూట్ నుంచి మహేష్ ఫ్రీ అవుతాడని టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.