AKP: బొగ్గు లోడుతో తిరుగుతున్న లారీల వల్ల పరవాడ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నట్లు ఏపీ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్, పెందుర్తి టీడీపీ సమన్వయకర్త గండి బాబ్జికి పలువురు శుక్రవారం ఫిర్యాదు చేశారు. పరవాడలో ఈ మేరకు ఆయనకు ఫిర్యాదు అందజేశారు. బొగ్గు లారీలు కారణంగా ఏర్పడుతున్న కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నట్లు పేర్కొన్నారు.