ATP: నార్పల మండలంలో ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో మమత తెలిపారు. చామలూరు, దుగమర్రి గ్రామాల్లో కూలీలు చేసిన పనుల వివరాలను ఎంపీడీవో లాగిన్ నుంచి తొలగించినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనలో ఏపీవో ఎర్రమ్మ, సాంకేతిక సహాయకుడు సూర్యప్రకాష్, కంప్యూటర్ ఆపరేటర్ రంగస్వామిపై చర్యలు తీసుకున్నారు.