NLG: దేవరకొండ ఏబీవీపీ నగర శాఖ ఆధ్వర్యంలో జాతీయ వీర బాలల దినోత్సవం పురస్కరించుకుని స్థానిక పాఠశాలలో జోరా సింగ్, ఫతే సింగ్ చిత్ర పటానికి విద్యార్థులు పూలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నల్లగొండ విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ యలమల గోపీచంద్ మాట్లాడుతూ.. మొఘలుల అరాచక పరిపాలనను ఎదిరించి ప్రాణ త్యాగానికి వెనుకాడని వీర బాలలు అని గుర్తు చేశారు.