దేశాభివృద్ధిలో రానున్న 25 ఏళ్లు చాలా కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తాత్కాలికంగా వచ్చే ఆకర్షణలు, పాపులారిటీకి లొంగిపోవద్దని జెన్ జీకి సూచించారు. దేశాభివృద్ధికి పాటు పడిన గొప్ప వ్యక్తుల జీవితం నుంచి మంచి విషయాలు నేర్చుకోవాలని హితవు పలికారు. యువత అన్ని రంగాల్లో ముందుకు వెళ్లేందుకు తమ ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోందని, వాటి అందిపుచ్చుకోవాలని చెప్పారు.