AP: భారతదేశంలో నాలెడ్జ్కు కొదవ లేదని CM చంద్రబాబు అన్నారు. తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీలోని భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ‘మానసిక ఒత్తిడిని అధిగమించడంలో యోగాది కీలకపాత్ర. ఇటీవల విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాం. దేశాభివృద్ధిలో అనేక రంగాలు మిళితమై ఉన్నాయి. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత అత్యంత కీలక మార్పులు జరిగాయి’ అని పేర్కొన్నారు.