RSS చీఫ్ మోహన్ భగవత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్తో కలిసి ఆయన తిరుమలకు చేరుకున్నారు. వారికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ ఏకే సింఘాల్, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఎదురెళ్లి వారిని స్వాగతించారు. పండితులు వారికి వేదాశీర్వచనం అందించి.. శ్రీవారి శేషవస్త్రం కప్పారు.