KDP: చాపాడు మండల పరిధిలోని వెదురూరు గ్రామ సచివాలయంలో అత్యవసర గ్రామ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పంచాయితీ సెక్రెటరీ ఉమా పేర్కొన్నారు. వెదురూరు గ్రామ పంచాయతీ నుంచి రాజుపాలెం, నరహరిపురం గ్రామాలను ప్రత్యేక పంచాయతీగా చేసేందుకు ప్రజల అభిప్రాయాలు తెలుసుకొనుటకు సభను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు గ్రామ ప్రజలు సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.