RR: మంచిరేవుల ట్రెక్ పార్కులో రేపు సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు నేచర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు టూరిజం ఈడీ రంజిత్ నాయక్ తెలిపారు. ఈ క్యాంప్‌లో ట్రెక్కింగ్, క్యాంప్ ఫైర్, బర్డ్ వాచ్ వంటి కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ప్రకృతి ప్రేమికులు, అడ్వెంచర్ ఆసక్తి ఉన్నవారు పాల్గొనవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం 7382307476ను సంప్రదించాలన్నారు.