MDCL: జిల్లా పరిధిలో పలు పాత మున్సిపాలిటీల్లో పాత ఇళ్ల పైనే అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరైన పర్మిషన్లు లేకపోవడంతో ఈ భవనాలపై ఆస్తి పన్నులు సైతం సక్రమంగా వసూలు కావడం లేదు. దీంతో ఆదాయం తగ్గడమే కాకుండా పట్టణ ప్రణాళిక, భద్రతా ప్రమాణాలపై కూడా ప్రభావం పడుతోందన్నారు.