BDK: చుంచుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన తాజ్ డిలైట్ మండి హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గురువారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ఈ హోటల్ ద్వారా స్థానిక ప్రజలకు నాణ్యమైన భోజన సదుపాయం అందడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ సాబిర్ పాషా ఉన్నారు.