ADB: రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని MLA పాయల్ శంకర్ అన్నారు. గురువారం మావల మండలంలోని బట్టి సవర్గం గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.