ఒడిశాలోని కందమాల్ ఎన్కౌంటర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఘటనలో టాప్ లీడర్ గణేష్ సహా ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. దీనిపై షా ట్వీట్ చేస్తూ.. ఒడిశా దాదాపు మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని ప్రశంసించారు. అంతేకాదు, 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని మరోసారి స్పష్టం చేశారు.