SKLM: గత ప్రభుత్వాల తప్పిదాల కారణంగా 22- A జాబితాలోకి వెళ్లిన భూముల విషయంలో బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం 9:30 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ‘మీ చేతికి.. మీ భూమి 22- A భూ స్వేచ్ఛ’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మంత్రి ఇవాళ ప్రకటనలో తెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.