క్రిస్మస్ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి శ్రేయస్సు కోసం క్రీస్తు చేసిన త్యాగాన్ని క్రిస్మస్ గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. అలాగే శాంతి, సామరస్యం, సమానత్వం, సమాజ సేవాభావాలను బలోపేతం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా క్రీస్తు మార్గంలో దయ, సామరస్యంతో నిండిన సమాజ నిర్మాణం కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు.