WGL: పర్వతగిరి మండలం సోమవారం క్రాస్ మూలమలుపు వద్ద ఇవాళ పత్తి లోడుతో వరంగల్‌కు వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి రహదారిపై బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో ఉన్నవారు సురక్షితంగా బయటపడటంతో ప్రాణ నష్టం జరగలేదు. ఘటనతో కొద్దిసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాన్ని తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.