KKD: వచ్చే నెల నుంచి జిల్లాలోని అన్ని చౌక దుకాణాల్లో గోధుమ పిండి పంపిణీ చేస్తారని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఒక ప్రకటనలో తెలిపారు. రాయితీపై కిలో రూ.20కు అందజేస్తారని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన పోషక పదార్థాలను అందించే లక్ష్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కార్డు దారులు సద్వినియోగం చేసుకో వాలని జేసీ సూచించారు.