ప్రధాని మోదీ తన లక్నో పర్యటన సందర్భంగా ఇవాళ జాతీయ స్మారకం, ప్రాంగణం ‘రాష్ట్రీయ ప్రేరణ స్థల్’ను ప్రారంభించనున్నారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, పండిత్ దిన్దయాల్ ఉపాధ్యాయ, డా.శ్యామ ప్రసాద్ ముఖర్జీల 65 అడుగుల కాంస్య విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. వాజ్పేయి 101 జయంతి పురస్కరించుకుని ఈ ఆవిష్కరణల కార్యక్రమం చేపట్టారు.