NLR: రాష్ట్ర, జిల్లా ప్రజలకు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటున్నామని ఏసుప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయం అని అన్నారు. తన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా కృషి చేస్తామన్నారు