NLG: నకిరేకల్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో మామను హత్య చేసిన మేనల్లుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. తరచూ జరుగుతున్న గొడవలే హత్యకు కారణమని విచారణలో తేలిందన్నారు. నిందితుడు గట్టు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని, హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.