TG: క్రైస్తవులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ అందరి జీవితాల్లో ఆనందం, శాంతి నింపాలన్నారు. ప్రేమ, క్షమ, కరుణ, సహనానికి నిదర్శనం.. ఏసుక్రీస్తు జీవితం అని కొనియాడారు. ఈ క్రిస్మస్ ప్రపంచాన్ని మరింత శాంతియుతంగా మార్చడానికి సంకల్పించాలన్నారు.