MBNR: జిల్లాకు చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అబ్జర్వర్‌గా రెండోసారి నియమితులయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నియామక పత్రం జారీ చేశారు. వినోద్ కుమార్ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.