SRD: ఉపాధ్యాయుల బదిలీలు వెంటనే చేపట్టాలని ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రాథోడ్ రిమాండ్ చేశారు. హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంటాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న డీఎస్సీ- 2008 ఉపాధ్యాయులను వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న డీఎలను వెంటనే విడుదల చేయాలన్నారు.