NZB: మాక్లూర్ మండలం ముత్యంపల్లి గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సన్మానించారు. బీజేపీ మద్దతుతో సర్పంచ్‌గా గెలిచిన సుప్రియ, ఉపసర్పంచ్ పడాల శ్రీకాంత్, వార్డు సభ్యులు ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.