KKD: రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ సూచించారు. బుధవారం సామర్లకోట మండలం జీ.మేడపాడు సొసైటీలో యూరియా పంపిణీ విధానాన్ని ఆయన పరిశీలించారు. రైతులను పంపిణీ విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. యూరియాను ఎకరాకు 2 నుంచి 3 బస్తాలు మాత్రమే వినియోగించాలని ఆయన రైతులకు సూచించారు.