ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్టులపై నిర్మాత బన్నీ వాసు అప్డేట్ ఇచ్చాడు. దర్శకుడు అట్లీతో పాటు బన్నీ చేతిలో మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పాడు. అందులో ఒకటి 2026 జూలై లేదా ఆగస్టులో స్టార్ట్ అవుతుందని, మరొకటి 2027 మార్చిలో ప్రారంభం కానున్నట్లు వెల్లడించాడు. వీటిపై జనవరిలో అధికారిక ప్రకటన చేస్తామని అన్నాడు.