నెల్లూరు: బుచ్చి మండలం దామరమడుగు గ్రామంలోని శ్రీనివాసులు అనే వ్యక్తి నివాసంలో జరిగిన చోరీని బుచ్చి పోలీసులు చేధించారు. చోరీకి పాల్పడిన పఠాన్ ఇర్ఫాన్, వెంకటకృష్ణయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీకి గురైన టీవీ, బ్యాటరీ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు.