MHBD: కొత్తగూడ మండలంలో పేసా చట్టం మహోత్సవం సందర్భంగా ఆదివాసీ సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఆదివాసీ కమిటీ రాష్ట్ర నాయకుడు మల్లెల రాము మాట్లాడుతూ.. ఏజెన్సీ మండలాల్లో పేసా చట్టాన్ని బలోపేతం చేయాలని కోరారు. 1996 పేసా చట్టం ద్వారా ఆదివాసీలకు స్వయం నిర్ణయాధికారం లభించిందని, నూతన సర్పంచ్లు పేసా గ్రామసభలు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.