NLG: ప్రభుత్వం గొర్రెలకిచ్చే నట్టల నివారణ మందుల పంపిణీని గొర్రెల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలని సుంకెనపల్లి, వెలిమినేడు గ్రామ సర్పంచులు ఆవుల సునీత యాదయ్య, బొంతల చంద్రారెడ్డి అన్నారు. బుధవారం వెటర్నరీ వైద్యులు శ్రీనివాస్ గొర్రెలకు మందులను ఇచ్చారు. వెలిమినేడు కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకందారుల సొసైటీ ఛైర్మన్ బైకాని నాగరాజు పాల్గొన్నారు.