E.G: AP మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చాగల్లు(M) మీనానగరం గ్రామానికి చెందిన అమర్జహ బేగ్ మహమ్మద్ నియమితులయ్యారు. గతంలో గ్రామ సర్పంచ్‌గా, పార్టీలో వివిధ హోదాల్లో ఆమె పనిచేశారు. రాష్ట్రస్థాయిలో కీలక పదవి దక్కడంపై మీనానగరం వాసులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం PCC అధ్యక్షురాలు షర్మిల ఆమెకు అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అమర్జహ బేగ్ కృషి చేయాలని పేర్కొన్నారు.