అమెరికాలోని అక్రమ వలసదారులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘క్రిస్మస్ ఆఫర్’ ఇచ్చారు. ఎవరైతే స్వచ్ఛందంగా తమ దేశాలకు వెళ్లిపోతారో వారికి ఉచిత విమాన టికెట్ ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు, టికెట్‌తో పాటు 3000 డాలర్లు (సుమారు రూ. 2.5 లక్షలు) నగదు కూడా ఇస్తారట. అయితే ఈ స్కీమ్ డిసెంబర్ 31 వరకే ఉంటుంది. వెళ్లేవాళ్లు త్వరపడండి అని ట్రంప్ సర్కార్ చెబుతోంది.