ప్రస్తుతం ఎలక్ట్రిక్ కుక్కర్ల వాడకం పెరగడంతో గంజి కనుమరుగవుతోంది. అయితే, అన్నం వార్చగా వచ్చే గంజి ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు అజీర్తి, అల్సర్, మలబద్దకంలాంటి సమస్యలకు దివ్యౌషధం. గంజి శరీరానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది. చర్మ సౌందర్యం, జుట్టు దృఢత్వం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది.