MDK: క్రిస్మస్ వేడుకలు పురస్కరించుకొని ప్రసిద్ధ మెదక్ చర్చ్ వద్ద బందోబస్తును జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు స్వయంగా పర్యవేక్షించారు. చర్చి ప్రధాన ప్రవేశ ద్వారం నుంచి భక్తులు సులభంగా లోపలికి వెళ్లి ప్రార్ధనలు పూర్తిచేసుకుని ఎలాంటి అసౌకర్యం లేకుండా బయటకు వెళ్లేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనుమానితులను క్షుణ్ణంగా తనిఖీ చేసాకే పంపించాలన్నారు.