సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు గ్రామాలు, కాలనీల్లో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల రక్షణకు సంబంధించిన నూతన చట్టాలు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగంపై వివరించారు. అనుమానాస్పద ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.