»Marriage With A Cricketer Shubman Gill Sara Ali Khan Clarity
Sara Ali Khan: క్రికెటర్‌తో పెళ్లి.. సారా అలీఖాన్ క్లారిటీ!
బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్(Sara Ali Khan).. ఈ మధ్య తరచుగా వార్తల్లో నిలుస్తునే ఉంది. సినిమాలు, క్రికెట్‌తో తెగ సందడి చేస్తోంది. అయితే ఈ స్టార్ డాటర్ గత కొంత కాలంగా క్రికెటర్ శుభ్‌మన్ గిల్(shubman gill)తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించింది అమ్మడు.
సైఫ్ అలీ ఖాన్ తనయ సారా అలీ ఖాన్(Sara Ali Khan) నటించిన లేటెస్ట్ ఫిల్మ్.. ‘జర హట్ కే జర బచ్ కే’ పోయిన్ వారం థియేటర్లో వచ్చింది. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. దాంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో సారా అలీఖాన్ తన పై వస్తున్న రూమర్స్‌కు రియాక్ట్ అయింది. క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఎఫైర్ ఉందనే వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. క్రికెటర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అనే ప్రశ్నకు సారా అలీ ఖాన్ స్పందించింది.
తన జీవిత భాగస్వామిని ఇంకా కలవలేదని పేర్కొంది. కలిశానని కూడా అనుకోవడం లేదని చెప్పింది. అయితే తనకు క్రికెటర్ని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. అయితే తాను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని కండీషన్స్(conditions) ఉన్నాయని చెప్పుకొచ్చింది. అతను ఏ రంగానికి చెందిన వాడనేది పెద్దగా పట్టించుకోనని, క్రికెటర్ అయినా, నటుడైనా, వ్యాపారవేత్త అయినా.. ఏ రంగంలో ఉన్నా అభ్యంతరం లేదని, నా విలువలను గౌరవిస్తే చాలని చెప్పుకొచ్చింది. తన మానసిక, ఆధ్యాత్మిక విలువలకు సరితూగే వ్యక్తి దొరికినప్పుడు ఖచ్చితంగా.. అతడితో జీవితాన్ని ప్రారంభిస్తానని పేర్కొంది.
గతంలో సారా, గిల్(shubman gill)ఇద్దరు ఓ రెస్టారెంట్లో కంటబడడంతో.. ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే టాక్ నడిచింది. అయితే ఆ తర్వాత ఇద్దరు సోషల్ మీడియాలో అన్ ఫాలో అవడంతో.. బ్రేకప్ చెప్పుకున్నారని అనుకున్నారు. తాజాగా సారా అలీఖాన్ ఈ వార్తలను కొట్టిపారేసింది. ఇకపోతే.. కేథర్నాథ్ చిత్రంతో బాలీవుడ్‌లోకి హీరోయిన్గా పరిచయమైన సారా అలీ ఖాన్.. తనకంటూ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సింబా, లవ్ ఆజ్ కల్, కూలీ నెం.1, అట్రాంగి రే, గ్యాస్‌లైట్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ‘జరా హట్కే జరా బచ్కే’ చిత్రంతో థియేటర్లో సందడి చేస్తోంది.