విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో పాత కేసులను రీ-ఓపెన్ చేసిన పోలీసులు ఓ మిస్సింగ్ కేసును ఛేదించారు. 2012లో న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చుక్క కుమారి అదృశ్యమయ్యారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ చేసి సాంకేతిక ఆధారాలతో ఆమెను తెలంగాణలో గుర్తించారు. 13 ఏళ్ల తర్వాత ఆమెను క్షేమంగా తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించామని సీఐ టీ.కామేశ్వరరావు తెలిపారు.