KDP: చెన్నూరు మండలం రామనపల్లిలోని వరి కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పరిశీలించారు. రైతులు దళారులకు కాకుండా, ప్రభుత్వ మద్దతు ధరకే ధాన్యం విక్రయించాలని ఆయన సూచించారు. వరి సాగులో యూరియా వాడకం తగ్గించి, సమపాళ్ళలో పోషకాలు అందిస్తే అధిక దిగుబడి వస్తుందని తెలిపారు.