VKB: మద్యం ప్రియులకు ఎక్సైజ్ శాఖ శుభవార్త చెప్పింది. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని ఈనెల 31న రాత్రి ఒంటి గంట వరకు మద్యం దుకాణాలు తెరచి ఉండటానికి అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి విజయభాస్కర్ గౌడ్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఎక్సైజ్ మద్యం దుకాణం లైసెన్స్ పొందిన షాపులు 31న రాత్రి ఒంటి గంట వరకు విక్రయాలు జరపవచ్చని సూచించారు.