MBNR: దివ్యాంగుల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని శిశువు గృహాలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివ్యాంగుల సమస్యలు చాలా వరకు పరిష్కరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పాల్గొన్నారు.