NLG: దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం బాలల పరిరక్షణ సమితి సమావేశం నిర్వహించారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి గణేష్, కమిషనర్ సుదర్శన్ పాల్గొని మాట్లాడారు. బాలల పరిరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు. పరిరక్షణ చర్యల పలు సూచనలు చేశారు. సిడబ్ల్యూసి ఛైర్మన్ చింతా కృష్ణ, సీడీపీవో చంద్రకళ, ఎస్సై రాజు, ఎల్సీపీవో వెంకన్న, విజయలక్ష్మి, అంజలి తదితరులున్నారు.