ఏలూరు జిల్లా పోలీస్ స్పోర్ట్స్ యాన్యువల్ మీట్ ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఐదు రోజులుగా విజయవంతంగా జరిగిన క్రీడా పోటీలకు సహకరించిన అధికారులను, సిబ్బందిని అభినందించారు. క్రీడల ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందని తెలిపారు.