ప్రముఖ హిందీ రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత వినోద్ కుమార్ శుక్లా(89) అనారోగ్యంతో కన్నుమూశారు. ‘నౌకర్ కీ కమీజ్’ వంటి ప్రసిద్ధ నవలలు, కవితలతో హిందీ సాహిత్యానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. ఛత్తీస్గఢ్ నుంచి జ్ఞానపీఠ్ అందుకున్న తొలి వ్యక్తిగా చరిత్రకెక్కారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. సాహిత్య ప్రపంచం ఒక దిగ్గజాన్ని కోల్పోయిందని కొనియాడారు.