MDK: జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని గృహ నిర్మాణ శాఖ పీడీ మాణిక్యం పేర్కొన్నారు. జిల్లాలో 4,529 మంది లబ్ధిదారులకు ఇప్పటికే రూ. 90 కోట్ల చెల్లింపులు జరిగాయని తెలిపారు. వివిధ దశల్లో ఉన్న 509 మంది లబ్ధిదారులకు వారంలో రూ. 6.46 కోట్లు ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం గూడు లేని నిరుపేదలను గుర్తించి నిధులను మంజూరు చేసిందన్నారు.