ADB: తెలంగాణ గురుకులాల ఉమ్మడి పరీక్ష ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహించడం జరుగుతుందని TGSWREIS జిల్లా కోఆర్డినేటర్ లలిత కుమారి మంగళవారం తెలియజేశారు. 5వ నుంచి 9వ తరగతి వరకు ప్రవేశానికి గానూ జనవరి 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు వసతి, భోజనంతో పాటు పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందజేయనున్నట్లు పేర్కొన్నారు.