సత్యసాయి: కొత్తచెరువులోని శివసాయి డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ బాబు పాల్గొన్నారు. వివిధ కంపెనీలకు ఎంపికైన 182 మంది అభ్యర్థులకు ఎమ్మెల్యే నియామక పత్రాలను అందజేశారు.