VZM: యేసు ప్రభువు త్యాగం అందరికీ ఆదర్శనీయమని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి కొనియాడారు. జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సెమి క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, MLC ఇందుకూరి రఘురాజు, తదితరులు పాల్గొన్నారు.