SDPT: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా స్థానిక పాఠశాల విద్యార్థులు పొలాల్లోకి వెళ్లి రైతులను కలిశారు. సాగులో వారు పడే కష్టాన్ని, వ్యవసాయం ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్యామల మాట్లాడుతూ.. భావితరాలకు అన్నదాత విలువ తెలియాలనే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. అనంతరం విద్యార్థులు రైతులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.