NRPT: ఈ నెల 25 నుంచి 28 వరకు కర్ణాటక రాష్ట్రం మంగళూరులో నిర్వహించే 69వ జాతీయస్థాయి ఎస్జీఎఫ్ 19 ఏళ్ల లోపు బాలుర నెట్‌బాల్ పోటీలకు ధన్వాడ మండలం కొండాపూర్ ఇంటర్మీడియట్ కళాశాలకు చెందిన గిరిజన విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ రాజారాం తెలిపారు. గణేష్, మహేష్ ఎంపికయ్యారని చెప్పారు. జిల్లాలో జరిగిన పోటీల్లో ప్రతిభ చూపి వారు ఈ అవకాశాన్ని దక్కించుకున్నారని పేర్కొన్నారు.