NLG: బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎలాంటి బెదిరింపులకు పాల్పడిన భయపడవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సర్పంచులకు అండగా ఉండేందుకు ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేసి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. నల్గొండ పార్టీ ఆఫీస్లో ఇవాళ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.