MBNR: అడ్డాకుల మండలం వేముల సర్పంచ్ రవిరాజాచారి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. విషయాన్ని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయికి ఎమ్మెల్యే తెలుపగా, ఆమె స్పందిస్తూ గ్రామంలోని తాగునీటి సమస్య పరిష్కారం కోసం తక్షణమే రూ.8.50 లక్షల నిధులు మంజూరు చేశారు.